శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 నవంబరు 2015 (16:50 IST)

వ్యభిచార రొంపిలోకి విద్యార్థినులను ప్రోత్సహించిన మహిళా ప్రొఫెసర్‌కు ఏడేళ్ళ జైలుశిక్ష

విద్యార్థినులను వ్యభిచారం చేయాల్సిందిగా ప్రోత్సహించిన కేసులో తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా ప్రొఫెసర్‌కు తిరుపతి కోర్టు ఏడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సోమవారం వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
పద్మావతి మహిళా యూనివర్శిటీ ప్రొఫెసర్ వసంతకుమారి తన వద్ద చదువుకునే విద్యార్థినులను కన్నబిడ్డలుగా చూసుకోవాల్సింది పోయి.. వ్యభిచారం చేయాల్సిందిగా ప్రోత్సహించింది. దీనిపై పలువురు బాధిత విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించడంతో తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత గత సంవత్సరం మహిళా ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన కింది కోర్టు ఆమె చేసింది తీవ్రమైన నేరమని అభిప్రాయపడుతూ, ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన తీర్పును తిరుపతి కోర్టులో వసంత కుమారి సవాల్ చేయగా, ఆ కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది.