గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (15:57 IST)

చేదుగా వుందని కాకరకాయను తినడం మానేశారో...?

చేదుగా వుందని కాకరకాయన తినడం మానేస్తే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే కాకరకాయలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. బ్రోకోలీ కంటే రెండింతలు బీటా కెరోటిన్ కాకరలో వున్నాయి. ఇవి శరీరానికి విటమిన్-ఎ

చేదుగా వుందని కాకరకాయన తినడం మానేస్తే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే కాకరకాయలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. బ్రోకోలీ కంటే రెండింతలు బీటా కెరోటిన్ కాకరలో వున్నాయి. ఇవి శరీరానికి విటమిన్-ఎని ఇస్తాయి. శరీరానికి ఎ విటమిన్ ద్వారా కంటికి, చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే పాలకూర కంటే ఇందులో క్యాల్షియం అధికంగా వుంటుంది.
 
క్యాల్షియం ద్వారా ఎముకలు, దంతాలకు బలం లభిస్తుంది. ఇందులోని పొటాషియం నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. హృద్రోగాలను దూరం చేస్తుంది. కాకరలోని చారన్టిన్ అనే ధాతువులు రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. మధుమేహగ్రస్థుల్లో ఇన్సులిన్‌ను కాకర పెంచుతుంది. కాకరలో విటమిన్ బి1, 2, 3, సి, మెగ్నీషియం, ఫొలేట్, సింగ్, ఫాస్పరస్, మాంగనీస్ పీచు వంటివి వున్నాయి. 
 
ఉదర సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కాకర జ్యూస్‌ను వారానికి ఓసారి తీసుకోవాలి. కాకర గింజలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అనవసరమైన కొవ్వును కరిగిస్తాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో గల అడ్డంకులను తొలగిస్తాయి. కాకర జ్యూస్, నిమ్మరసంతో కలిపి ఉదయం పరగడుపున తీసుకుంటే మొటిమలుండవు. చర్మవ్యాధులు నయం అవుతాయి.
 
కాకర రసాన్ని జీలకర్ర పొడితో రుబ్బుకుని.. ఆ పేస్టును మాడుకు రాస్తే చుండ్రు తొలగిపోతుంది. కాకర రసంతో అరటి పండు గుజ్జును చేర్చి తలకు రాస్తే కూడా చుండ్రు దూరమవుతుంది. కాకర రసంతో పంచదారను కలిపి పేస్టులా రుబ్బుకుని తలకు రాస్తే జుట్టు రాలడం తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.