శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (15:34 IST)

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే?

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే అవి త్వరగా తగ్గుతాయట. బొప్పాయిలోని కైమోపాపైన్, పాపైన్ అనే ఎంజైములు గాయాలను త్వరితగతిన మాన్పిస్తాయట. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఇది నిరోధిస్

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే అవి త్వరగా తగ్గుతాయట. బొప్పాయిలోని కైమోపాపైన్, పాపైన్ అనే ఎంజైములు గాయాలను త్వరితగతిన మాన్పిస్తాయట. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఇది నిరోధిస్తుందట. బొప్పాయిలోని బీటా కెరోటిన్‌ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కారణంగా  పేగుక్యాన్సర్‌‌ను నిరోధించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా బొప్పాయిని అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియకీ దోహదపడుతుంది. పొటాషియం, పీచూ ఎక్కువగా ఉండటంవల్ల హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ. అలాగే మధుమేహం తగ్గాలంటే పీచు పుష్కలంగా ఉండే బొప్పాయిని తీసుకోవాల్సిందే.
 
బొప్పాయిలోని కోలీన్‌ నిద్ర పట్టడానికీ కండరాల కదలికలకీ, జ్ఞాపకశక్తులను పెంచడానికీ దోహదపడుతుంది. అంతేకాదు, ఇది కొవ్వుని కరిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.