గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2016 (17:28 IST)

ఎరుపు రంగు క్యాప్సికమ్ తినండి.. ముడతలకు చెక్ పెట్టండి

ఎరుపు రంగు క్యాప్సికమ్ తీసుకోవడం ద్వారా ముడతలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని పచ్చిగా సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో సి, బి6 విటమిన్లూ, పీచు, కెరొటినాయిడ్లూ ఉంటాయి. ఈ ప

ఎరుపు రంగు క్యాప్సికమ్ తీసుకోవడం ద్వారా ముడతలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని పచ్చిగా సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో సి, బి6 విటమిన్లూ, పీచు, కెరొటినాయిడ్లూ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ముడతల్ని నివారిస్తాయి. అదే సమయంలో మొటిమలు రాకుండా అడ్డుకోవడమే కాదు, రక్తప్రసరణ కూడా బాగా జరిగేలా చేస్తాయి. తరచూ దీన్ని తీసుకోగలిగితే వార్థక్యపు ఛాయలు చాలామటుకూ దూరం అవుతాయంటున్నారు నిపుణులు.
 
అలాగే ముడతలకు చెక్ పెట్టాలంటే.. 
 
* గ్రీన్‌టీ: ఇందులోనూ కెఫిన్‌ ఉంటుంది కానీ.. అదనంగా ఎల్‌-థియనైన్‌ అనే అమినోయాసిడ్‌ మనకెంతో మేలు చేస్తుంది. ఒత్తిడి తగ్గించి శరీరం విశ్రాంతి పొందేలా చేస్తుంది. గ్రీన్‌టీలో ప్రత్యేకంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి వార్థక్యపు ఛాయలు రాకుండా కాపాడతాయి.
 
* పాలకూర: ఇందులో మెగ్నీషియం, విటమిన్‌ సి, ఇ, ఎ, ఫొలేట్‌, ఫైబర్‌, ప్లాంట్‌ప్రొటీన్‌, ఇనుము లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పాలకూర ఎక్కువగా తీసుకుంటే చర్మానికి తగినంత పోషణ అంది, మొటిమలూ, ముడతల్లాంటివి తొందరగా రావు.
 
* బొప్పాయి: ఇందులో ఖనిజాలే కాదు, విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మెరిసేలా కూడా చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల చర్మం తాజాగా మారి నిగనిగలాడటం ఖాయం.