శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (13:25 IST)

ఆవనూనెతో దోసగింజల పొడిని కలిపి పాదాలకు రాసుకుంటే?

దోసపండు, దోసకాయలో సౌందర్య పోషణకు తగినన్ని గుణాలున్నాయి. దోసపళ్ల రసం, కీరదోస రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకుని.. అందుకు ఓట్స్ పొడిని కాస్త

దోసపండు, దోసకాయలో సౌందర్య పోషణకు తగినన్ని గుణాలున్నాయి. దోసపళ్ల రసం, కీరదోస రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకుని.. అందుకు ఓట్స్ పొడిని కాస్త కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం సౌందర్యం పెంపొందుతుంది.
 
ముఖం డల్‌గా కనిపిస్తే.. దోసపండు ముక్కను ముద్ద చేసుకుని.. ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఆరిపోయాక కడిగేస్తే ముఖం కాంతివంతమవుతుంది. దోసగింజల పొడి ముఖ సౌందర్యానికే కాకుండా పొడి జుట్టుకు చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. ఆవనూనెతో దోసగింజల పొడిని కలిపి పాదాలకు రాసుకుంటే.. పాదాలు దూదిలా మెత్తబడతాయి.
 
ఇక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రభావం కళ్ళ చుట్టూ ఉండే చర్మంపై కూడా పడుతుంది. అందుచేత కంటి కిందటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. పాల పొడి, దోసగింజల పొడి సమానంగా తీసుకుని, నీటిలో కలిపి, కళ్ల చుట్టూ పూసుకోవాలి. ఐదు నిమిషాల తరువాత కడిగేయాలి. కళ్ల చుట్టూ ఉండే ముడతలు, నల్లని వలయాలు, అలసటా పోయి, కళ్లు ప్రకాశవంతంగా తయారవుతాయని బ్యూటీషన్లు చెప్తున్నారు.