శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (12:26 IST)

మామిడి గుజ్జుతో చర్మసౌందర్యం.. మామిడి గుజ్జు.. ముల్తానీమట్టిని ప్యాక్‌తో?

వేసవిలో లభించే పసందైన మామిడి పండ్లను రుచి చూసేందుకే కాదు.. సౌందర్య పోషణకు కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ చర్మం మృదువుగా మారాలంటే.. రెండు చెంచాల పచ్చిపాలు, చెంచా తేనెతో పాటు పెద్ద చెంచా మామిడి పండు గుజ్జున

వేసవిలో లభించే పసందైన మామిడి పండ్లను రుచి చూసేందుకే కాదు.. సౌందర్య పోషణకు కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ చర్మం మృదువుగా మారాలంటే.. రెండు చెంచాల పచ్చిపాలు, చెంచా తేనెతో పాటు పెద్ద చెంచా మామిడి పండు గుజ్జుని కలిపి ప్యాక్‌లా వేసుకుంటే ముఖం తేమతో వెలిగిపోతుంది. పొడిబారకుండా ఉంటుంది. అలాగే మామిడి పండు గుజ్జు, ముల్తానీమట్టిని పేస్టులా చేసుకుని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది. మచ్చలు తొలగిపోతాయి. 
 
ఇదేవిధంగా మామిడి గుజ్జు, బాదం కాంబోలో చర్మానికి మేలు చేసుకోవచ్చు. రెండు బాదం గింజలని నానబెట్టుకుని వాటిని మెత్తగా నూరుకుని, రెండు చెంచాల మామిడిపండు గుజ్జులో వేసి బాగా కలపాలి. దీనిలో ఒక చెంచా ఓట్‌మీల్‌ పొడి చేర్చి ముఖానికి పట్టించాలి. ఎండ కారణంగా అలసిన చర్మానికి ఈ పూత చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.