శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (19:15 IST)

పూలను తలలో పెట్టుకోవటానికే కాదు....

పువ్వులను తలలో పెట్టుకునేందుకే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవటానికి కూడ వాడవచ్చు. ఎలాగో చూద్దాం. 1. గులాబి పూల ఫేస్ ప్యాక్ అన్నిరకాల స్కిన్ టైప్స్ మీద బాగా పనిచేస్తుంది. టానింగ్‌ను పోగొడుతుంది. ఈ ప్యాక్ ముఖానికి రాసుకుంటే మంటగాని దురదగాని ఉండదు. శాం

పువ్వులను తలలో పెట్టుకునేందుకే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవటానికి కూడ వాడవచ్చు. ఎలాగో చూద్దాం.
 
1. గులాబి పూల ఫేస్ ప్యాక్ అన్నిరకాల స్కిన్ టైప్స్ మీద బాగా పనిచేస్తుంది. టానింగ్‌ను పోగొడుతుంది. ఈ ప్యాక్ ముఖానికి రాసుకుంటే మంటగాని దురదగాని ఉండదు. శాండల్‌వుడ్ పౌడర్‌లో గులాబిపూల గుజ్జు, కొబ్బరినీళ్లు పోసి ఫేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి రాసుకొని సున్నితంగా మసాజ్ చేయాలి.
 
2. పొద్దుతిరుగుడు పువ్వులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన మృదువైన చర్మం కావాలంటే విటమిన్ ఇ ఎంతో అవసరం. టొమాటోల్లోని లైకోపెన్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వును మెత్తగా నూరి అందులో టొమాటో గుజ్జు, పచ్చిపాలను కలిపి  పేస్టులా చేయాలి. ఆ పేస్టును ప్రిజ్‌లో అరగంట సేపు వుంచి ఆ తర్వాత చర్మంపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
3. మందారంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది. మొటిమలు, మచ్చలుంటే పోతాయి. ఓ కప్పు చల్లటి నీటిలో కొన్ని మందార పువ్వులు వేసి రాత్రంతా నాననివ్వాలి. మర్నాడు ఉదయం వేళ పూలను నీళ్లల్లోంచి తీసి మెత్తగా నూరాలి. మందార పువ్వులను నానబెట్టిన నీళ్లను వడకట్టి పక్కన పెట్టుకోవాలి. మెత్తగా చేసిన మందార పూలలో మూడు టీ స్పూన్ల ఓట్స్, రెండు చుక్కల టీట్రీ ఆయిల్ వేసి మందారం నీళ్లని ఇందులో కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టుని ముఖానికి రాసుకొని 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.