శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (15:49 IST)

వేసవిలో చర్మ సౌందర్యానికి చిన్ని చిట్కాలు

వేసవి కాలంలో చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో బయట తిరిగితే సన్‌టాన్‌‌తో చర్మం నలుపుగా తయారవుతుంది. అలాంటి నలుపు చర్మాన్ని పోగొట్టుకోవాలంటే.. చందనం పొడి నాలుగు స్పూన్లు తీసుకుని అందుల

వేసవి కాలంలో చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో బయట తిరిగితే సన్‌టాన్‌‌తో చర్మం నలుపుగా తయారవుతుంది. అలాంటి నలుపు చర్మాన్ని పోగొట్టుకోవాలంటే.. చందనం పొడి నాలుగు స్పూన్లు తీసుకుని అందులో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి, మెడకు రాసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
 
అలాగే రెండు చెంచాల చందనం పొడి, ముల్తానీమట్టి, తగినంత రోజ్ వాటర్ తీసుకుని పేస్టులా కలుపుకుని ముఖానికి పట్టించాలి. ఆపై అరగంట తర్వాత చల్లనినీటితో కడిగేయాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేస్తే పొడి చర్మం తాజాగా మారుతుంది. 
 
ఇక శెనగపిండి, చందనంపొడి, పసుపు, బియ్యం పొడి తీసుకుని గులాబీనీటితో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. చర్మం కాంతివంతంగా తయారవుతుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు.