శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:17 IST)

గ్రామీణ రహదారులకు మహర్దశ.. రూ.97 వేల కోట్లతో రోడ్ల నిర్మాణం.. అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ బడ్జెట్ 2016-17 ముఖ్యాంశాలు...

దేశంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ చేకూరనుంది. గ్రామీణ భారతంలోని రోడ్ల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 19 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ కేటాయింపులు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద కేటాయించారు. అలాగే, దేశ వ్యాప్తంగా రూ.27 వేల కోట్లతో 2.23 లక్షల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. మొత్తంమీద రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.97 వేల కోట్లను కేటాయించారు. 
 
ఇకపోతే.. నాబార్డ్‌ ద్వారా రూ.20 వేల కోట్లతో ఇరిగేషన్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా 300 రూర్బన్‌ క్టస్లర్లను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ విద్యుదీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కోసం రూ.9 వేల కోట్లు, పంటల బీమో పథకం కోసం రూ.5,500 కోట్లు, సేంద్రియ వ్యవసాయానికి రూ.412 కోట్లను కేటాయింపులు జరిపినట్టు తెలిపారు. 
 
వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ.86,500 కోట్లు వ్యయం చేస్తామని విత్తమంత్రి ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం కల్పిస్తామని, ఆర్థిక సంస్కరణలు, వ్యాపారానుకూల వాతావరణం, ఆర్థిక క్రమశిక్షణ, పన్ను సంస్కరణలపై దృష్టి సారిస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే లక్ష్యమని వెల్లడించారు.