శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (11:50 IST)

సాధారణ బడ్జెట్ 2016-17: వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 7కి పెరిగింది: అరుణ్ జైట్లీ

సాధారణ బడ్జెట్ 2016-17: 350 బిలియన్ డాలర్లకు పెరిగిన విదేశీ మారకాలు

2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. రెండేళ్ల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 21 నెలలుగా తాము తీసుకున్న చర్యలతో వృద్ధిరేటు పెరిగిందని జైట్లు వెల్లడించారు. విదేశీ మారక స్థాయులు పెరిగాయని, 350 మిలియన్ డాలర్ల  విదేశీ మారక నిల్వలున్నాయని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతానికి తగ్గిందని చెప్పుకొచ్చారు. ద్రవ్యలోటును 1.4 శాతానికి తగ్గించడమే లక్ష్యమని పేర్కొన్నారు. 21 నెలలుగా తాము తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు పెరిగిందని జైట్లీ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రణాళికా వ్యయాన్ని పెంచుతున్నామని తెలిపారు. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని, సవాళ్లను అవకాశాలుగా మలచుకున్నామని తెలిపారు. 
 
ఎన్ని ఆటంకాలొచ్చినా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇక ప్రాధాన్యంతాంశాల్లో రైతాంగం, వ్యవసాయాన్ని చేర్చామని, వ్యవసాయం- ఉపాధి హామీ అనుసంధానమైందని చెప్పారు.