గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:21 IST)

బడ్జెట్ 2016-17: ప్రతి కుటుంబానికీ రూ.లక్ష వర్తించేలా కొత్త బీమా పథకం

స్వచ్ఛ భారత్ కోసం రూ.9వేల కోట్లు: అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రైతాంగానికి పెద్దపీట వేశారు. ఇంకా స్వచ్ఛ భారత్  కోసం రూ.9వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి కుటుంబానికీ లక్ష వర్తించేలా కొత్త బీమా పథకం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. రూ.27వేల కోట్లతో 2.23 లక్షల కి.మీ.ల రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. 
 
అలాగే ప్రధాన మంత్రి పిలుపుతో 75 లక్షల మంది గ్యాస్ రాయితీ వదులుకున్నారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సాగునీటి కోసం రూ.86,500 కోట్లు వ్యయం కానున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ.19వేల కోట్లు కేటాయించారు. నాబార్డ్‌ ద్వారా రూ.20వేల కోట్లతో ఇరిగేషన్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారు. 
 
* గ్రామీణ విద్యుదీకరణకు పటిష్టమైన చర్యలు 
* పశు పోషణకు కొత్తగా 4 పథకాలు అమలు 
* సేంద్రియ వ్యవసాయానికి రూ.412 కోట్లు 
* గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం 
* ఆర్థిక సంస్కరణలు, వ్యాపారానుకూల వాతావరణం, ఆర్థిక క్రమశిక్షణ, పన్ను సంస్కరణలపై దృష్టి సారిస్తాం. 
* మౌలిక సదుపాయాలకు కేటాయింపులు పెంచుతాం.
* పశువైద్య పరీక్షల కార్డులు, పాల సేకరణకు ప్రోత్సాహం, ఈ-మార్కెటింగ్‌ సౌకర్యం కల్పన 
* వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే లక్ష్యం 
* నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీ 
* పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ.500కోట్లు కేటాయించారు.