శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr

గుజరాత్ - మహారాష్ట్రలు తగ్గించాయి.. మరి తెలుగు రాష్ట్రాల సంగతేంటి?

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు తు.చ తప్పకుండా పాటిస్తున్నాయి. మరి బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిల పరిస్థితి ఏమిటన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు తు.చ తప్పకుండా పాటిస్తున్నాయి. మరి బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిల పరిస్థితి ఏమిటన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
ఇటీవలి కాలంలో దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కారు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అలాగే, రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్‌ను తగ్గించాల్సిందిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సూచనలు చేశారు. దీనిపై గుజరాత్‌, మహరాష్ట్ర స్పందించాయి.
 
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు పెట్రోల్‌, డీజిల్‌పై విధించే వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. రెండు ఇంధనాలపై వ్యాట్‌ను 4 శాతం తగ్గిస్తున్నట్లు గుజరాత్‌ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే మహారాష్ట్ర కూడా తగ్గించింది. 
 
పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూపాయి తగ్గించాలని మహారాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి. దీంతో ఆ రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ రూ.75.58, డీజిల్‌ రూ.59.55గా ఉండనుంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబై, థానేల్లో పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌, డీజిల్‌పై 24 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తున్నారు. ఈ తగ్గింపుతో మహారాష్ట్రకు 2 వేల కోట్ల రూపాయల మేరకు గండిపడనుంది.