బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (16:59 IST)

మారన్ సోదరులకు క్లీన్‌చిట్... సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ ఉన్న సమయంలో తన అన్న కళానిధి మారన్ సారథ్యంలోని సంస్థలకు చట్టవిరుద్ధంగా వందల సంఖ్యలో టెలిఫోన్ కనెక్షన్లను కల్పించిన కేసులో మారన్ బ్రదర్స్‌క

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ ఉన్న సమయంలో తన అన్న కళానిధి మారన్ సారథ్యంలోని సంస్థలకు చట్టవిరుద్ధంగా వందల సంఖ్యలో టెలిఫోన్ కనెక్షన్లను కల్పించిన కేసులో మారన్ బ్రదర్స్‌కు విముక్తి లభించింది. ఈ స్కామ్‌లో కళానిధి మారన్, దయానిధి మారన్‌లు సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల చేసింది.
 
ఈ కేసు నుంచి తమను విముక్తి చేయాలంటూ వారిద్దరూ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ వ్యతిరేకించింది. వీరిద్దరిపైనా విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. అయితే, మారన్ బ్రదర్స్ తరపున హాజరైన న్యాయవాది తమ క్లయింట్లు అమాయకులని, వారేమీ నష్టం కలిగించలేదని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మారన్ సోదరులను సీబీఐ కోర్టు ఈ ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది.
 
దయానిధి మారన్ తన ఇంట్లో ఓ ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 764 టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సన్ టీవీ డేటాను చట్టవిరుద్ధంగా అప్‌లింక్ చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా చేయడం వల్ల చెన్నైలోని బీఎస్ఎన్ఎల్, ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్‌లకు రూ.1.78 కోట్లు నష్టం వాట్లినట్టు సీబీఐ ఆరోపించింది. అయితే, ఈకేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఇందులో వారిద్దరి పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ మారన్ సోదరులకు విముక్తి కల్పించింది.