శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2014 (17:24 IST)

ముర్గ్ కాలీ మిర్చి: ఇండియన్ పెప్పర్ చికెన్

కావలసిన పదార్థాలు :
చికెన్ - ఒక కేజీ 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు
పెప్పర్ పౌడర్ - 2 టీస్పూన్లు
కాశ్మీరీ కారం - ఒక టీస్పూన్
పసుపు - అర టీస్పూన్ 
పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
పెప్పర్(మిరియాలు) - ఒక  1tbsp
పచ్చిమిర్చి - 2 (మొత్తం ) + 4 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) 
ఆవాలు - అర టీ స్పూన్
కొత్తిమీర - 3 కాడలు (తరిగినవి) 
ఆవాలు నూనె - 3 టేబుల్ స్పూన్లు 
ఉప్పు - తగినంత
 
తయారుచేయు విధానం: ముందుగా చికెన్ శుభ్రం చేసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. తర్వాత చికెన్ ముక్కల మీద నిమ్మరసం పిండి, కారం, పసుపు, పెప్పుర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ , పెరుగు మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.  ఇప్పుడు చికెన్ ను సుమారు రెండు గంటల సేపు ఫ్రిజ్ లో నానబెట్టుకోవాలి. తర్వాత డీప్ బాటమ్ పాన్ తీసుకుని, అందులో  కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు మరియు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం మిక్సీ జార్ లో జీలకర్ర, ధనియాలు మరియు మిరియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పోపు వేగుతున్న పాన్‌లో వేసి రెండు మూడు నిముషాలు తక్కు మంట మీద ఫ్రై చేసుకోవాలి.
 
ఇప్పుడు  నానబెట్టుకున్న చికెన్ ముక్కలు, ఎక్స్ ట్రా మసాలా కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా ఇమురుతూ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి.  అనంతరం మూత పెట్టి 12 - 15 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి అవసరం అయితే ఒకటి నుండి రెండు కప్పుల నీరు కూడా చేర్చుకోవచ్చును. మొత్తం మిశ్రమం డ్రై అయ్యే వరకూ ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. అంతే ముర్గ్ కాలీ మిర్చిని రోటీస్ లేదా పరాటోలతో సర్వ్ చేయాలి.