గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2016 (12:54 IST)

హైదరాబాద్ ఐఐటీలో 47 కొత్త కోర్సులు.. ఐఐటీ-ఎం సహకారంతో...

ఐఐటీ-మద్రాస్ సహకారంతో నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) దేశంలోని 7 ఐఐటీలు, ఐఐఎస్‌లలో 47 ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులకుగాను ప్రవేశాలను ఉచితంగా ఎన్రోల్ చేసుకోనున్నారు. ఇందులోభాగంగా హైదరాబాద్ ఐఐటీలో కొత్తగా 47 ఆన్‌లైన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు ఐఐటీ హైదరాబాద్ పీఆర్‌వో రుచికాశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల ఎన్రోల్‌కు ఈ నెల 18 నుంచి 25 వరకు ONLINECOURSES NPTEL.AC.IN వెబ్‌సైట్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. 
 
ఆ కోర్సుల్లో చేరేందుకు ఎలాంటి అర్హతలు అవసరంలేదు. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సెషన్లు, లెస్సన్లను నేర్చుకోవచ్చని వివరించారు. వీలును బట్టి వారాంతపు పాఠ్యాంశాలను నేర్చుకుంటూ ఆన్‌లైన్ ద్వారానే అసైన్‌మెంట్‌లను పూర్తి చేయవచ్చని వివరించారు. కోర్సు అనంతరం నామమాత్రం రుసుంతో ఐఐటీ నుంచి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ మానవ అభివృద్ధి శాఖ సహకారంతో ఎన్‌పీటీఈఎల్ తన సేవలను అందిస్తున్నదని ఆమె వివరించారు.