శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (18:38 IST)

మల్టిపుల్ వరల్డ్ రికార్డులతో అదరగొట్టిన కె విశాలిని.. ఎవరీమె?

పేరు కె. విశాలిని. తమిళనాడు తిరునెల్వేలిలో జన్మించింది. తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు కలిశలింగం యూనివర్శిటీలో బిటెక్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థినిగా చేరింది. అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌గా ఉంటూనే తన పేరిట వరల్డ్ రికార్డులు సంపాదించుకుంది. హెచ్చార్డీ ట్విట్టర్లో టీచర్స్ డేను పురస్కరించుకుని అత్యధిక రికార్డులు సాధించిన విద్యార్థుల జాబితాను పోస్ట్ చేసింది. ఇందులో విశాలిని రికార్డులే ట్విట్టర్ జనాన్ని ఆశ్చర్యపరిచింది. 
 
పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకే విశాలిని గ్రేట్ గర్ల్ అంటూ ట్వీట్స్ వెల్లువెత్తాయి. ఇంతకీ విశాలిని రికార్డులు ఏంటంటే..?
* ది హైయెస్ట్ ఐక్యూ (225) ఇన్ ది వరల్డ్  (The IQ (225) in the world)
* ది యంగస్ట్ సిస్కో సర్టిఫైడ్ నెట్ వర్క్ అసోసియేషన్ వరల్డ్ రికార్డు హోల్డర్ ( The youngest cisco certified network association world record holder)
* ది యంగస్ట్ ఐఈఎల్‌టీఎస్ వరల్డ్ రికార్డు హోల్డర్ ( The youngest IELTS world record holder)
* ది యంగస్ట్ ఎక్సిన్ క్లౌడ్ కంప్యూటింగ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ( The youngest exin cloud computing world record holder) 
* ది యంగస్ట్ సీసీఎస్‌ఏ వరల్డ్ రికార్డు హోల్డర్ ( The youngest CCSA world record holder) వంటి అదిరిపోయే రికార్డులను విశాలిని తన పేరిట లిఖించుకుంది. 
 
ఇదే తరహాలో సర్తాక్ భరద్వాజ్ అనే విద్యార్థి జూనియర్ మాస్టర్ చెఫ్ కాంపిటీషన్‌లో విన్నర్‌గా నిలిచాడు. ఇతని వివరాలను సైతం హెచ్చార్డీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలా వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థుల వివరాలను హెచ్చార్డీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.