గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (06:37 IST)

తమిళనాడు : మరో 24 గంటలు అతి భారీ వర్షాలు

ఈశాన్య రుతపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈశాన్య రుతపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి బాలచంద్రన్‌ తెలిపారు. 
 
ఈ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మంగళవారం నాలుగు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, బుధవారం కూడా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది.