గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (07:24 IST)

తమిళనాడు పరువు పోయె... ఐటీ ఉచ్చులో 12 మంది మంత్రులు 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌లు

తమిళనాడు ప్రభుత్వంలో ప్రజాపనులశాఖ ఇసుక కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు జరిపేందుకు ఢిల్లీ ఐటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. త్

తమిళనాడు ప్రభుత్వంలో ప్రజాపనులశాఖ ఇసుక కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు జరిపేందుకు ఢిల్లీ ఐటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలో ఐటీ దాడులు సాగుతాయని అంటున్నారు. శేఖర్‌రెడ్డితో అక్రమ లావాదేవీలు నడిపి లబ్ధి పొందిన 12 మంది మంత్రుల మెడకు సైతం ఐటీ ఉచ్చు చుట్టుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌కు అక్రమార్కుల చిట్టాను అందజేసిన ఐటీశాఖ ఉన్నతాధికారులు దాడులకు అనుమతి కోసం వేచి ఉన్నారు. 
 
 
శేఖర్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసిన సమయంలో రూ.300 కోట్ల విలువైన అక్రమాల వివరాలతో కూడిన డైరీ ఐటీ అధికారులకు లభించినట్లు తెలుస్తోంది. శేఖర్‌రెడ్డితో అక్రమ లావాదేవీలు జరిపిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నా రు. అంతేగాక వారికి ఇచ్చిన కమీషన్‌ వివరాలు సైతం పొందుపరిచి ఉన్నాయి. డైరీలో లభించిన వివరాల ఆధారంగా ఒక్కొక్క పేరును బయటకు తీసి రహస్య విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధించిన పాన్‌ మసాలా, గుట్కా తదితర మత్తు పదార్థాలు రహస్య అమ్మకాలకు మార్గం సుగమం చేసి, కమీషన్‌ పుచ్చుకున్న సుమారు 50 మంది అధికారుల పేర్లు ఐటీ చేతుల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌కు ఐటీ శాఖ అందజేసి, తగిన చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. 
 
కాగా అన్నాడీఎంకే జయ అనుకూల వర్గం నేత పన్నీర్ సెల్వంపై కూడా మరకలు పడ్డాయి.  జయలలిత మరణించిన తరువాత 15 రోజుల్లో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బీమా బిల్లు కోసం రూ.808 కోట్ల నిధులను ఒకే సంతకంతో విడుదల చేయడం వెనుక దాగి ఉన్న అవినీతిపై ముఖ్యమంత్రి పళనిస్వామి ఇప్పటికే విచారణకు ఆదేశాలు చేసారు. ప్రతిపక్ష నేత స్టాలిన్  అన్నాడీఎంకే (అమ్మ) ప్రభుత్వంలోని మంత్రుల, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించాలని ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు సోమవారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతి హిమాలయ పర్వతాల అంత ఎత్తుకు చేరుకుందని ఆయన విమర్శించారు.