గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 19 మే 2017 (09:08 IST)

పళని గ్రూప్‌లో ముసలం పుట్టిందా.. 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పన్నీరుకు ఢిల్లీ పిలుపు

తమిళ రాజకీయాల్లో ఉన్నట్లుండి అనూహ్య పరిణామాలకు గురువారం సాక్షీభూతంగా నిలిచింది. సీఎం ఎడప్పాడి పళనిస్వామిపై 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, అన్నాడిఎంకే అమ్మ విభాగ ప్రధాన నేత పన్నీర్ సెల్వంకు ఉన్నట్లుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి పిలువు రావడం ఒక్కస

తమిళ రాజకీయాల్లో ఉన్నట్లుండి అనూహ్య పరిణామాలకు గురువారం సాక్షీభూతంగా నిలిచింది. సీఎం ఎడప్పాడి పళనిస్వామిపై 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, అన్నాడిఎంకే అమ్మ విభాగ ప్రధాన నేత పన్నీర్ సెల్వంకు ఉన్నట్లుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి పిలువు రావడం ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించింది. సీఎం ఎడప్పాడిపై 13 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయనున్నారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఓపీఎస్‌ హఠాత్తుగా ప్రధానితో సమావేశం కానుండడం తమిళనాట సంచలనం రేపుతోంది.

అయితే... త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకే ప్రధానితో ఓపీఎస్‌ భేటీ అవుతున్నారని ఆయన వర్గీయులు తెలిపినప్పటికీ సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని అనుమానాలు రేగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రధానితో బేటీకానున్న పన్నీర్ సెల్వం గురువారం రాత్రే హుటాహుటిన డిల్లీ బయలు దేరి వెళ్లడం గమనార్హం. 
 
మరోవైపు... పళనిస్వామికి వ్యతిరేకంగా దళిత వర్గానికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. ప్రభుత్వంలో దళిత వర్గానికి అధిక ప్రాధాన్యంకల్పించాలని ఆ ఎమ్మెల్యేలు కొన్నాళ్ల కిందటే డిమాండ్‌ చేశారు. కానీ, పళనిస్వామి అంతగా పట్టించుకోలేదు. దీంతో మాజీ మంత్రులు వేంకటాచలం, పళనియప్పన్‌, సెంథిల్‌ బాలాజీ సారథ్యంలోని 13 మంది ఎమ్మెల్యేలు బుధవారం చెన్నైలోనే రహస్య సమావేశం నిర్వహించారు. తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని ఈ భేటీలో తీర్మానించినట్టు సమచారం. అలాగే, తమ డిమాండ్ల చిట్టాను ముఖ్యమంత్రి ఎడప్పాడి వర్గానికి అందజేసినట్టు తెలిసింది. వీటిపై సీఎం స్పందించే తీరును బట్టి తదుపరి చర్యలకు దిగాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
అన్నిటికంటే మించిన ట్విస్ట్ ఏదంటే తిరుగుబాటు గ్రూప్‌కి చెందిన ఎమ్మెల్యేలంతా మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం వర్గానికి టచ్‌లో ఉన్నట్టు మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయం తెలియగానే కొందరు సీనియర్‌ మంత్రులు రంగంలోకి దిగి దళిత ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు.