గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (12:40 IST)

చిన్నారులకు నలుగుపిండి.. టీనేజర్లకు కొబ్బరి నీరు.. ఎందుకు?

చిన్నారుల నుంచి టీనేజర్ల వరకు పిల్లల్లను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలి. చిన్న పిల్లల్లోనూ, టీనేజర్లలో చర్మ సమస్యలను దూరం చేయాలంటే... తప్పకుండా ఈ టిప్స్ పాటించాలి. స్నానం దగ్గర తీసుకునే జాగ్రత్తలు పిల

చిన్నారుల నుంచి టీనేజర్ల వరకు పిల్లల్లను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలి. చిన్న పిల్లల్లోనూ, టీనేజర్లలో చర్మ సమస్యలను దూరం చేయాలంటే... తప్పకుండా ఈ టిప్స్ పాటించాలి. స్నానం దగ్గర తీసుకునే జాగ్రత్తలు పిల్లల మేని ఛాయ మెరిసిపోయేందుకు దోహదం చేస్తాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే వారానికి ఓసారి శనివారం పూట స్నానానికి ముందు నువ్వుల నూనెతో మర్దన చేయడం, నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల చర్మ కాంతి రెట్టింపు అవుతుంది. మర్దన చేయడం చిన్నారుల శారీరక ఎదుగుదలకూ దోహదం చేస్తుంది. చర్మసమస్యలు దూరమవుతుంది. 
 
అలాగే పిల్లల చర్మానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. తేనెలో ఉండే విటమిన్‌-బి చర్మం రంగును మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక చిన్నపిల్లల్లోనే కాకుండా టీనేజర్లలో ఛాయ పెంపొందించాలంటే.. కొబ్బరి నీటితో ముఖం, శరీరాన్ని మర్దన చేయాలి. పళ్లు తింటే ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిది. కాస్త పెద్దపిల్లల్లో చర్మం పాలరంగు సంతరించుకోవాలంటే బొప్పాయి, అనాస పళ్లు పిల్లలకు తినిపిస్తుండాలి. హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడంతో.. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాంటప్పుడే చర్మ వ్యాధులను అవి దూరం చేస్తాయి.