శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (11:39 IST)

వీరూ చెలరేగాడు.. రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.. అదే భారత అత్యధిక స్కోరు..

భారత్-విండీస్ మధ్య జరిగిన నాలుగో వన్డే డిసెంబర్ 8, 2011 జరిగింది. ఈ వన్డేలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెలరేగిపోయాడు. తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్లకు తన బ్యాటింగ్‌తో చుక్కలు

భారత్-విండీస్ మధ్య జరిగిన నాలుగో వన్డే డిసెంబర్ 8, 2011 జరిగింది. ఈ వన్డేలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెలరేగిపోయాడు. తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్లకు తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదుతూ వీర విహారం చేశాడు. మొత్తం 149 బంతులాడిన సెహ్వాగ్ 25ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఏకంగా 219 పరుగులతో డబుల్ సెంచరీ చేశాడు. ఇది వన్డే కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డును సృష్టించాడు. 
 
వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధికమించి.. డబుల్ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతేకాదు.. అప్పటికి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా కూడా సెహ్వాగ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ రికార్డును కొన్నాళ్లకు టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ 264 పరుగులతో సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. 
 
సెహ్వాగ్ వీర విహారం చేసిన ఈ మ్యాచ్‌లో భారత్ 153 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 418 పరుగులు చేసింది. భారత జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం.