గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: చెన్నై , శుక్రవారం, 30 జూన్ 2017 (22:58 IST)

భవిష్యత్తు క్రికెటర్ల ప్రదాత అతడే.. ది వాల్‌పై బీసీసీఐ అపార విశ్వాసం

టీమిండియాకు భవిష్యత్తు క్రికెటర్లను అందించేందుకు భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కంటే మించిన కోచ్ మరొకటు లేడని బీసీసీఐ స్థిర నిర్ణయానికి వచ్చింది. అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గా ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో మరో రెండేళ్లపాటు అండర్‌-19, భారత్‌-ఏ జట్

టీమిండియాకు భవిష్యత్తు క్రికెటర్లను అందించేందుకు భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కంటే మించిన కోచ్ మరొకటు లేడని బీసీసీఐ స్థిర నిర్ణయానికి వచ్చింది. అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గా  ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో మరో రెండేళ్లపాటు అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు సేవలం అందించాలని బీసీసీఐ సూచించింది. ఈ మేరకు ద్రావిడ్‌ పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గా మరో రెండేళ్ల పాటు 'మిస్టర్ డిపెండబుల్' ద్రావిడ్ సేవలు అందించనున్నాడు. 
 
2015లో ఈ రెండు విభాగాలకు కోచ్‌గా ద్రావిడ్ ను నియమించిన విషయం తెలిసిందే. క్లాసిక్ ఆటగాడు ద్రావిడ్ శిక్షణలోని అండర్-19 జట్టు గతేడాది జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరింది. దాంతో ద్రావిడ్‌పై బీసీసీఐ నమ్మకం బలపడింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ సంచలనాలు రిషబ్ పంత్, సంజూ శాంసన్, కరుణ్ నాయర్ లాంటి క్రికెటర్లు ద్రావిడ్ కోచింగ్‌తో రాటుదేలారు. 
 
ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీమిండియా కోచ్ పదవి కంటే కూడా.. భావి భారత క్రికెటర్లకు మెరుగులు దిద్దే అతి క్లిష్టమైన అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్‌కు మరోసారి అప్పగించింది.