గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By ivr
Last Modified: గురువారం, 27 అక్టోబరు 2016 (21:43 IST)

దీపావళి స్వీట్... గులాబ్ జామన్ తయారు చేయడం ఇలా...

ఈ దీపావళికి మీ ఇంట్లో ఏయే స్వీట్స్ చేస్తున్నారు.? అదే స్వీట్స్ చేసే పనిలోనే ఉన్నట్లైతే గుల్కన్ గులాబ్ జామన్ ట్రైచేసి చూడండి. కావలసివ పదార్థాలు : కోవా లేదా గుల్కన్- ఒక కప్పు పాలు - ఒక కప్పు నెయ్యి - వేయింపుకు సరిపడా యాలకుల పొడి- అర టీ స్పూన్ పంచద

ఈ దీపావళికి మీ ఇంట్లో ఏయే స్వీట్స్ చేస్తున్నారు.? అదే స్వీట్స్ చేసే పనిలోనే ఉన్నట్లైతే గుల్కన్ గులాబ్ జామన్ ట్రైచేసి చూడండి. 
 
కావలసివ పదార్థాలు :
కోవా లేదా గుల్కన్- ఒక కప్పు 
పాలు - ఒక కప్పు 
నెయ్యి - వేయింపుకు సరిపడా
యాలకుల పొడి- అర టీ స్పూన్ 
పంచదార - రెండు కప్పులు 
గులాబ్ జామ్ పౌడర్ - 200 గ్రాములు 
జీడిపప్పు -50 గ్రాములు 
బాదం పప్పు - 50 గ్రాములు 
పాకానికి పంచదార - అరకేజీ
 
తయారీ విధానం : 
 
ముందుగా పాన్ స్టౌపై ఉంచి.. కొద్ది నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి వేపుకోవాలి. అలాగే మరో స్టౌపై ప్యాన్ ఉంచి కొద్దిగా నీళ్లు, పంచదార వేసి లేతపాకం వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. సువాసన కోసం ఈ పాకంలో యాలకుల పొడిగాని, రోజ్ వాటర్‌‌గాని కలుపుకోవచ్చు.
 
తర్వాత గులాబ్‌జామ్ పౌడర్‌లో పాలు పోసి ఉండలు చేసుకునేందుకు వీలుగా పిండిని కలిపి అయిదు నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో గులాబ్‌ జామ్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో గుల్కన్ లేదా కోవా ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి. 
 
ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పంచదార పాకంలో వేయాలి. బాదం, జీడిపప్పులను గార్నిష్‌గా అలంకరించి సర్వ్ చేయాలి. గుల్కన్ గులాబ్ జామన్ రెడీ..