గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (17:18 IST)

కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసివుంచితే?

కిటికీలు మూసి వుంచుతున్నారా? ఎప్పుడు ప్రధాన ద్వారాలను మూసేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకండి. రాత్రిపూట మినహా పగలంతా ఇంటిలోపలికి వెలుతురును ప్రసరింపజేసే, కిటికీలు, ద్వారాలను తెరిచే వుంచాలంటున్నారు.. ఫ

కిటికీలు మూసి వుంచుతున్నారా? ఎప్పుడు ప్రధాన ద్వారాలను మూసేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకండి. రాత్రిపూట మినహా పగలంతా ఇంటిలోపలికి వెలుతురును ప్రసరింపజేసే, కిటికీలు, ద్వారాలను తెరిచే వుంచాలంటున్నారు.. ఫెంగ్‌షుయ్ నిపుణులు. కిటికీలను, తలుపులను ఎప్పుడూ మూసివుంచడం ద్వారా చి ప్రవాహం, సానుకూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. కిటికీలు కూడా అంతే. ఇంకా ఇంట్లో గాలిని శుద్ధీకరించే మొక్కలను వుంచుకోవాలి. ఇవి గాలిని శుభ్రపరచడంతో పాటు ఇంట్లోకి  పాజిటివ్ శక్తులను ఆహ్వానిస్తాయి. 
 
అలాగే ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వున్న వారు మనస్సును ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ చిరాకు, కోపంతో ఉండకూడదు. పడకగది, బాత్రూమ్, కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి. ఈ మూడింటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా కొత్త ఎనర్జీ లభిస్తుంది. తద్వారా ఆ ఇంట ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా చేరుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.  
 
ఇంకా, ఆరోగ్యం, ధనం ప్రాప్తించాలంటే.. ఈ ఫెంగ్‌షుయ్ టిప్స్ పాటించండి. 
ఇంట్లో మనీ ప్లాంట్ తప్పనిసరిగా వుంచండి. 
ఫెంగ్ షుయ్ లక్కీ బాంబోను కొనండి. 
ఫౌంటైన్‌తో కూడిన చిత్ర పటాలను ఇంట వుంచండి. 
అద్దంలో నీరు తెలిసేలా వుండే చిత్రపటాలు ఇంట్లో వుండటం ద్వారా ధనార్జన చేకూరుతుంది. 
 
నదులు, చెరువులు, జలపాతాలతో కూడిన చిత్రాలను ఇంట్లో వుంచడం మంచిది.     
పచ్చదనంతో కూడిన పటాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. 
ధనం వుంచే ప్రాంతాల్లో ఫెంగ్ షుయ్ రంగులను వుంచండి 
గ్రీన్, బ్రౌన్, బ్లూ, బ్లాక్‌లను వినియోగించండి.
లేత పసుపు రంగు, ఆరెంజ్ కూడా ధనార్జనకు ఉపయోగపడుతుందని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు.