గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (05:01 IST)

మైగ్రేన్ @ వితవుట్ ఆపరేషన్: దుష్ప్రభావాలు మటుమాయం

మైగ్రేన్ తలనొప్పితో బాధపడే చిన్నారులకు ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే దాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నూతన పద్ధతి చాలా సురక్షితమైందని, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తాజా అధ్యయనంలో తేలింది.

మైగ్రేన్  తలనొప్పితో బాధపడే చిన్నారులకు ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే దాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నూతన పద్ధతి చాలా సురక్షితమైందని, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తాజా అధ్యయనంలో తేలింది. స్పెనోపాలటైన్  గాంగ్లియన్ గా పిలిచే ఈ పద్ధతిలో ఎటువంటి సూదుల అవసరం ఉండదని, సూదులకు బదులుగా చిన్నపాటి గొట్టాన్ని నాసికా రంధ్రాలకు జతచేసి చికిత్సను అందిస్తారు.
 
ముక్కు వెనక భాగంలో ఉండే నరాలు మైగ్రేన్  నొప్పిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు. 12 ఏళ్లు దాటిన యువకులు, పెద్దల్లో 12 శాతం మంది మైగ్రేన్  తలనొప్పితో బాధపడుతున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. యుక్తవయసులో ఉన్న వారి మైగ్రేన్  వల్ల రోజువారీ కార్యకలాపాలైన ఆటలు ఆడటం, పాఠశాలకు వెళ్లలేకపోవడం, సంగీతాన్ని ఆస్వాదించలేకపోవడం వంటివి జరుగుతున్నాయని తెలిపారు.