గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (11:41 IST)

రోజుకో అరటిపండు తినండి.. లివర్‌ను శుభ్రం చేసుకోండి.

రోజుకో అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో వుండే కెరొటినాయిడ్స్ లివర్‌నే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అరటిలో క్యాన్సర్ కారకాలప

రోజుకో అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో వుండే కెరొటినాయిడ్స్ లివర్‌నే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అరటిలో క్యాన్సర్ కారకాలపై పోరాడే శక్తి అధికంగా వుంది. రోజూ ఓ అరటిపండును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటకి సంబంధించిన వ్యాధులు రాకుండా వుంటాయి. దృష్టి లోపాలు దూరమవుతాయి. అరటి పండులోని ఫైబర్ బరువు తగ్గిస్తుంది. హృద్రోగాలను దూరం చేస్తుంది. అరటిలోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
రక్తంలోని చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కిడ్నీకి కూడా అరటి మేలు చేస్తుంది. బీపీని నియంత్రించే అరటి కిడ్నీ సంబంధిత రోగాలను దరిచేరనివ్వవు. అరటిపండ్లను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో జరుగుతుంది. పెరుగు, బనానా స్మూతీలా చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు. సాయంత్రం పూట ఉడికించిన తృణధాన్యాలతో పాటు అరటి పండ్ల ముక్కలను తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.