Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అరటిపండును రాత్రిపూట తినకూడదట?

బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (10:46 IST)

Widgets Magazine

పొటాషియం పుష్కలంగా వుండే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అల్సర్‌కు చెక్ పెట్టే అరటి పండును భోజనం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. 
 
కానీ, రాత్రి భోజనం తర్వాత మాత్రం తీసుకోవద్దునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..? ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడడానికి, జలుబుకు దారితీస్తుంది. అందుకే అరటిని రాత్రిపూట తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు. అరటి పండు మధ్యాహ్నం పూట తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.. అలాగే పరగడుపున అరటి పండును తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహాలిస్తున్నారు.  
 
అలాగే ఆపిల్ పండును కూడా రాత్రిపూట తీసుకోకూడదు. యాపిల్‌లో వుండే యాసిడ్స్ కడుపులో ఆమ్ల స్థాయిల్ని పెంచుతాయి. అంతేకాకుండా ఆపిల్‌లో వుండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై భారం పడేలా చేస్తుంది. 
 
పెక్టిన్ కారణంగా అసిడిటీ ఏర్పడుతుంది. అందుకే ఆపిల్‌ను అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని.. తద్వారా అధిక బరువు సమస్య వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఆపిల్‌లోని పెక్టిన్ చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

శృంగారంలో విఫలం... ఏదేదో తినేబదులు ఇవి తింటే చాలు...

ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితంలో శరీరానికి, మనసుకి అస్సలు విశ్రాంతి ఉండడంలేదు. ...

news

చెరుకు రసం తాగితే శరీరానికి మంచిదా? కాదా?

వేసవి కాలం వచ్చేసింది. మన దాహాన్ని తీర్చకోవడానికి ఫ్రిజ్‌లో కూల్ డ్రింక్స్, మంచినీరు ...

news

కోపంతో ఊగిపోతున్నారా? పెద్ద పెద్దగా అరుస్తున్నారా?

తరచూ ఆగ్రహంతో ఊగిపోయేవారు ఇక జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే..? కోపాన్ని పక్కనబెట్టకపోతే.. ...

news

గుండెకు మేలు జరగాలా? బరువు తగ్గాలా ఇలా చేయండి..

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా ...

Widgets Magazine