శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (12:32 IST)

మూడీగా వున్నారా? అలా ఎండలో కాసేపు నిలబడితే..?

మూడీగా వున్నారా? అయితే ఎండలో కాసేపు గడపండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పని ఒత్తిడి, కదలకుండా ఒకే చోట కూర్చునేవారు.. కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఎండలో గడపాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చే

మూడీగా వున్నారా? అయితే ఎండలో కాసేపు గడపండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పని ఒత్తిడి, కదలకుండా ఒకే చోట కూర్చునేవారు.. కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఎండలో గడపాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎండనుంచి వెలువడే సూర్యకిరణాలు శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. అంతేకాదు మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది. అలాగే కనీసం రోజుకు ఏడు గంటల సమయం నిద్రపోవాలి. 
 
నిద్రకు అతి తక్కువ సమయాన్ని కేటాయించినా కూడా మెదడు ఒత్తిడికి లోనవుతుంది. శరీరంలా మెదడుకీ విశ్రాంతి అవసరం. అది సాధ్యం కావాలంటే హాయిగా నిద్రపోవాలి. దానికి దినచర్యను రూపొందించుకోవాలి. ఎంత పని ఉన్నా సరే నిద్ర కోసం 7-8 గంటలు కేటాయించాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అలాగే మనసులోని భావాలను లేదా కష్టసుఖాలను పంచుకోవడానికి స్నేహితులు వుండి తీరాలి.
 
అప్పుడే మనసులోని ఒత్తిడి పోతుంది. అలా మనసూ తేలికవుతుంది. కాబట్టి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోకుండా సన్నిహితులతో మాట్లాడాలి. మన బాధను పంచుకోవాలి. అందుకే నిత్యం అందరితో కలిసి ఉంటూ, సంతోషంగా ఉండేవారు ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అంటున్నారు.. మానసిక నిపుణులు.