గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (17:31 IST)

బాదం పప్పుల్ని నానబెట్టే ఎందుకు తీసుకోవాలి?

బాదం పప్పుల్ని నానబెట్టకుండా అలాగే తినడం కంటే నానబెట్టి పైనున్న పొరను తీసేసి తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పుపై పొర ఎంజైమ్ నిరోధకాన్ని కలిగి వుంటా

బాదం పప్పుల్ని నానబెట్టకుండా అలాగే తినడం కంటే నానబెట్టి పైనున్న పొరను తీసేసి తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పుపై పొర ఎంజైమ్ నిరోధకాన్ని కలిగి వుంటాయి. అందుకే పై పొర తీసేయకుండా తింటే.. శరీరం పోషకాలను గ్రహించలేకపోతుంది. అంతేగాకుండా సులభంగా జీర్ణం కాదు. 
 
అదే రాత్రిపూట నీటిలో నానబెడితే, పై పొరను సులభంగా తొలగించవచ్చు.. వాటిని తినడం ద్వారా సులభంగా పోషకాలను పొందవచ్చు. నానబెట్టిన బాదంలు త్వరగా జీర్ణమవటమే కాకుండా, జీర్ణక్రియను ప్రోత్సహించే ఎంజైమ్‌లను విడుదల చేస్తాయి. బాదంలో ఉండే మోనోసాకరైడ్‌లు ఆకలిని నియంత్రించి, పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. 
 
బరువు తగ్గాలనుకునేవారు నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.