శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By chitra
Last Updated : శనివారం, 2 జులై 2016 (10:08 IST)

ఆ కోరికలు వాళ్ళకే ఎక్కువ...మగాడ్ని పడకమీదికి రప్పించడం..!

శృంగారం విషయంలో పురుషుల కంటే మహిళలకే సిగ్గు బిడియం కాస్త ఎక్కువ. బిడియం వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. తనలో కోరికలు కలిగినప్పుడు తన భర్తని ఎలా శృంగారానికి ఆహ్వానించడమనే విషయంలో మహిళలు ఇబ్బంది పడుతుంటా

శృంగారం విషయంలో పురుషుల కంటే మహిళలకే సిగ్గు బిడియం కాస్త ఎక్కువ. బిడియం వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. తనలో కోరికలు కలిగినప్పుడు తన భర్తని ఎలా శృంగారానికి ఆహ్వానించడమనే విషయంలో మహిళలు ఇబ్బంది పడుతుంటారు. సెక్స్ కావాలని భర్తని అడగలేక నానా తంటాలు పడుతుంటారు. అయితే వారికి విధమైన సెక్స్ కావాలో అడగడానికి సిగ్గుగా ఉన్నప్పుడు పెదవి విప్పకుండా అతన్ని ముగ్గులోకి లాగవచ్చుననే విషయాన్ని మహిళలు ముందుగా తెలుసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
 
మీకు సెక్స్ కావాలని అనిపించినప్పుడు మీరు అతన్ని రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శిస్తూ పడకగదిలోకి రప్పించండి. మీలో కోరిక రగులుతుందని, మీరు సెక్స్ కావాలని అనుకుంటున్నారని అతనికి తెలిసే విధంగా అందాలను ఎరగా వేయండి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ శరీరభాషతో, శరీర కదలికలతో అతన్ని మీ వైపు ఆకర్షించి, పడక గదిలోకి నడిపించవచ్చు. అది మీ భర్తకి కూడా ఆనందాన్ని ఇస్తుంది.
 
పడకగదిలోకి వచ్చిన మీ భర్త మెడ, తల, చేతులు, చెవులపై ముద్దుల వర్షం కురిపించండి. కాళ్ల వంటి శరీరావయాలపై మర్దన చేయడం ప్రారంభించండి. మెడ అత్యంత కామోద్రేక భాగమని చాలామందికి తెలీదు. మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టండి. దేహస్పర్శ అతన్ని తప్పకుండా సెక్స్ వైపు మళ్లిస్తుంది.
 
పెదవి విప్పకుండా మీ మగాడ్ని పడకమీదికి రప్పించడం పెద్ద పనేం కాదు. అతని కళ్లలో కళ్లు పెట్టి చూడండి. అలా చూసినప్పుడు మీ ఆహ్వానాన్ని సులువుగా అందుకుంటాడు. కనుబొమలతో సైగలు, ఓ చిరునవ్వు చిందిస్తే చాలు అతడు పడకగదికే కాదు స్వర్గానికి కూడా మీతో వచ్చేస్తాడు.