శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By TJ
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (19:56 IST)

శృంగార కోర్కెలు తగ్గుతున్నాయా... కారణాలివే...

భార్యాభర్తల మధ్య శృంగారం ఆరోగ్యకరంగా వున్నప్పుడు వారి సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొందరిలో శృంగార ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా భాగస్వామిని సరిగ్గా తృప్తి పరచలేకపోతారు. చాలామందికి శృంగారంపై అసలు ఆసక్తి కూడా ఉండదు. కానీ భాగస్వామికి శృంగా

భార్యాభర్తల మధ్య శృంగారం ఆరోగ్యకరంగా వున్నప్పుడు వారి సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొందరిలో శృంగార ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా భాగస్వామిని సరిగ్గా తృప్తి పరచలేకపోతారు. చాలామందికి శృంగారంపై అసలు ఆసక్తి కూడా ఉండదు. కానీ భాగస్వామికి శృంగార కోర్కెలు ఎక్కువగా ఉంటే సంసారంలో గందరగోళం నెలకొంటుంది. ఇద్దరూ పూర్తిస్థాయిలో సంసారంలో పాల్గొన్నప్పుడే సంసార జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
స్త్రీలు రోజంతా పనిచేసి రాత్రి సమయంలో విశ్రాంతి కోరుకుంటారు. ఆ సమయంలో పురుషులు శృంగారం కోరుకుంటే వారు తిరస్కరిస్తారు. అది మనస్సులో పెట్టుకుని ఏదైనా గొడవ జరిగితే రెట్టించి మాట్లాడి గొడవను పెద్దది చేసుకుంటుంటారు. పురుషులు విధి నిర్వహణలో బిజీగా ఉండి శృంగార విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేకపోతారు. 
 
పని ఒత్తిడి కారణంగా శృంగారంపై ఆసక్తి ఉండదు. వర్క్ టెన్షన్స్‌లో వున్న సమయంలోనూ భాగస్వామి శృంగారంపై తీవ్ర ఒత్తిడి చేస్తే శృంగారం చేస్తారు. కానీ పెద్దగా అది సంతృప్తినివ్వదు. స్త్రీ, పురుషుల్లో మదుమేహం లాంటివి ఉన్నప్పుడు శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. 40 యేళ్ళ లోపు శృంగారం చేయాలన్న ఆసక్తి ఉంటుంది. కనుక దీన్ని అధిగమించేందుకు రోజూ వ్యాయామంతో పాటు దంపతులు వారంలో కనీసం ఒకరోజు సంతోషంగా అన్ని పనులను పక్కనపెట్టి హాయిగా కాలం గడపాలి.