శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (16:16 IST)

ఆ ఆంటీతో తొలిసారి సెక్స్... వయగ్రా వేసుకోమంటున్నాడు ఫ్రెండ్...

నేను ఉద్యోగరీత్యా ద్వితీయస్థాయి నగరంలో ఉంటున్నాను. నాకింకా పెళ్లి కాలేదు. నేను అద్దెకు ఉండే పక్క పోర్షనులో ఓ ఆంటీ ఉంది. ఆమెకు భర్త లేరని తెలుసింది. ఐతే ఆమె నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. మొన్నీమధ్య ఒకసారి నేనే మాట్లాడుతూ వారి ఇంటికెళ్లాను. అక్కడ ఆమె పరిస్థితి చూసి జాలి వేసింది. భర్త లేకుండా ఎనిమిదేళ్లుగా అలానే ఉంటుందట. ఈ కారణంగా ఆమెకు దాంపత్య జీవితం లేకుండా పోయింది. ఆ సంతోషాన్ని నేనివ్వాలనకుంటున్నాను. ఇదే విషయం ఆమెతో చెబితే ఏమీ మాట్లాడలేదు. నా స్నేహితుడొకరు మాత్రం ఆమెను తృప్తి పరచాలంటే వయగ్రా తీసుకుని వెళ్లమని చెప్పాడు. ఐతే తొలిసారిగా సెక్సులో పాల్గొంటున్న నాకు ఇవన్నీ భయంభయంగా ఉన్నాయి...

 
ముందుగా ఆ ఆలోచనలను వదిలేయండి. ఆమెతో మీతో సెక్సుకు సిద్ధమని చెప్పలేదు. వివాహేతర సంబంధం చేటు తెస్తుంది. అంతగా మీకు ఆమె అంటే ఇష్టమైతే ఆమెతో మాట్లాడి, మీ పెద్దలతో చర్చించి వివాహం చేసుకోండి. అలా కాకుండా ఇలాంటి సంబంధంతో దగ్గరయితే ఆమె జీవితంతోపాటు మీ జీవితం కూడా కష్టాల్లో పడుతాయి. ఇక వయగ్రా అనేది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. పైగా అది అంగ స్తంభన సామర్థ్యం అంతగా లేనివారు తీసుకునేదిగా చెపుతుంటారు. కాబట్టి దాని జోలికి వెళ్లకండి.