శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (16:26 IST)

స్మార్ట్ ఫోన్లను టాయిలెట్లలో వాడుతున్నారా? డయేరియా ఖాయం..

స్మార్ట్ ఫోన్లను ఎక్కడపడితే అక్కడ వాడేస్తున్నారా? స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారా? చివరికి టాయ్‌లెట్లో కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవని తాజా పరిశ

స్మార్ట్ ఫోన్లను ఎక్కడపడితే అక్కడ వాడేస్తున్నారా? స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారా? చివరికి టాయ్‌లెట్లో కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవని తాజా పరిశోధనలో తేలింది. 
 
టాయ్‌లెట్‌లో స్మార్ట్ ఫోన్లను వాడటం ద్వారా డయేరియా, మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. టాయ్‌లెట్‌లో ఉండే సింకులు ఇతరత్రా పింగాణీలపై ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగాలు క‌లిగించే బాక్టీరియా ఉంటుంది. 
 
టాయ్‌లెట్‌కి మొబైల్ తీసుకెళ్లి ఆ బేసిన్ల‌ను ముట్టుకున్న చేతుల‌తోనే మ‌ళ్లీ మొబైల్ ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల బాక్టీరియా ఫోన్ మీద‌కి చేరుకుంటుంది. ఫోన్ ద్వారా ఆ బ్యాక్టీరియా ఏదో రకంగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని లండ‌న్ మెట్రోపాలిట‌న్ యూనివ‌ర్సిటీకి చెందిన డాక్ట‌ర్ పాల్ మెటెవాలే చెప్పారు. 
 
స్మార్ట్ ఫోన్లను ఎక్కడపడితే అక్కడ వాడటం.. బూట్లను ఇంటిలోపల ధరించడం, టీవీ రిమోట్, కంప్యూటర్ కీబోర్డులు శుభ్రం చేయకపోయినా రోగాలు తప్పవని.. అందుకే ఇంటిని, మనం నిత్యం వాడే వస్తువులను శుభ్రంగా వుంచుకోవాలని మెటెవాలే వెల్లడించారు.