గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 జనవరి 2015 (18:33 IST)

మెడిటేషన్ చేస్తున్నారా..? కడుపు ఖాళీగా ఉంచండి!

మెడిటేషన్ చేస్తున్నారా.. అయితే కడుపు ఖాళీగా ఉంచుకోండి. కడుపు నిండుగా ఉన్నప్పుడు ధ్యానం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత ధ్యానం చేస్తే మగతతో నిద్ర వచ్చేస్తుంది. భోజనం లేదా విందు తర్వాత సుమారు రెండు గంటల విరామం ఇచ్చాకే ధ్యానం చేయాలి. 
 
అలాగే ధ్యానం చేయాలనుకుంటే తొలుత అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి. దీనిని రోజు ప్రారంభ సమయాల్లో చేయటం మంచిది. ఈ సమయంలోనే నిశ్సబ్దం, ప్రశాంతత ఉంటాయి. 
 
అలాగే రోజులో ఈ సమయంలో తగినంత ఖాళీ లేని వారు అనేక మంది ఉన్నారు. అందువల్ల పనయ్యాక  సాయంత్రం లేదా నిద్రించే ముందు మెడిటేషన్ చేయవచ్చు. కానీ ప్రతి రోజు ఒకే సమయంలో చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.