శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (06:34 IST)

సొరకాయ గింజలు - జీలకర్ర మిశ్రమాన్ని అన్నంలో తీసుకుంటే...

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ - సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో జీవ క్రియల్ని క్

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.  విటమిన్ - సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో జీవ క్రియల్ని క్రమబద్ధం చేసే గుణం ఉంది. అందువల్ల ఇది పురుషుల పాలిటవరంగా ఉంది. 
 
వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం. సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శారీరక దారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది.
 
హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరుచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే... శొంఠిపొడినిగానీ, మిరియాల పొడినిగానీ కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరుచూ తింటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.