శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : సోమవారం, 11 జనవరి 2016 (13:18 IST)

ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ తయారీ ఎలా?

చలికాలంలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. అయితే గొంగూర ఉంటే మాత్రం ఎంచక్కా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే చాలా మందికి నోరూరుతుంది. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు కూడా చేసుకోవచ్చు.
 
కావలసిన పదార్థాలు : 
బోన్లెస్ చికెన్: అర కేజీ
‌గోంగూర : ఒక కట్ట
అల్లం, వెల్లుల్లి పేస్టు : రెండు స్పూన్లు
గరం మసాలా : 1 స్పూన్
పచ్చిమిర్చి : మూడు
పసుపు : చిటికెడు
ఉల్లిపాయలు : మూడు
పోపుదినుసులు : 1 స్పూన్
కారం : రెండు టీస్పూన్లు
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత
కొత్తిమీర : తగినంత
 
తయారీ విధానం :   
చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. గోంగూరను ఉడికించి మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాత్రలో నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి అవి వేగాక చికెన్ ముక్కల్ని కూడా వేసి సన్నని మంటపై మగ్గనిచ్చి సరిపడా నీరు పోసి కొంచెం సేపు ఉడికించాలి. 
 
ఇప్పుడు ముందుగానే రుబ్బి పెట్టుకున్న గోంగూర ముద్ద, గరంమసాలా వేసి మరి కొంచెం సేపు ఉడికించాలి. దించుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే నోరూరించే గోంగూర చికెన్ రెడీ.