శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (17:10 IST)

మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి మీ కోసం..

మష్రూమ్స్‌తో ఎలాంటి వంటకం తయారు చేసిన అద్భుతమైన రుచిని ఇస్తుంది. అలాంటిది మష్రూమ్స్‌తో గ్రేవీ చేసినా, మంచూరియన్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. అలాంటి మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి ఎలా చెయ్యాలో ఇప్

మష్రూమ్స్‌తో ఎలాంటి వంటకం తయారు చేసిన అద్భుతమైన రుచిని ఇస్తుంది. అలాంటిది మష్రూమ్స్‌తో గ్రేవీ చేసినా, మంచూరియన్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. అలాంటి మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.
 
కావాల్సిన పదార్థాలు:
మష్రూమ్స్ - 1/4 కేజీ
ఆలుగడ్డలు - 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పచ్చి మిర్చి - 1 స్పూన్
ఉల్లిపాయలు - 1కప్పు
పంచదార - చిటికెడు
చిల్లిసాస్ - 1 స్పూన్
కార్న్ ఫ్లోర్ పిండి - 3  స్పూన్ 
సోయా సాస్ - 1 స్పూన్
వెనిగర్ - 1 స్పూన్
ఉప్పు, కారం - తగినంత
 
తయారీ విధానం:
ఒక గిన్నెలో శుభ్రం చేసుకున్న మష్రూమ్లను, ఉడికించిన ఆలుగడ్డలను వేసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర కాస్తంత కార్న్‌‍ఫ్లోర్ వేసి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తరువాత ఇంకొక గిన్నె తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్ ఉప్పు వేసి నీళ్ళు పోసి కలిపి మష్రూమ్స్‌ని అందులో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా వేయించాలి. 
 
ఇప్పుడొక పాన్ తీసుకుని అందులో నూనే పోసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత దానిలో పచ్చిమిర్చి ఉల్లితరుగు కూడా వేయాలి. అలా వేగుతున్న వాటిలో సోయాసాస్, చిల్లిసాస్, వెనిగర్, టమాటా సాస్, కొత్తిమీర తరుగు వెయ్యాలి. ఇలా తయారై దానిలో వేయించి పెట్టుకున్న మష్రూమ్స్‌ని వేసి కొంచెం నీరు పోసి కొంచెం సేపు వేగనివ్వాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మంచురియన్ డ్రై రెసిపి రెడీ.