శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : గురువారం, 12 మే 2016 (13:41 IST)

టమోటా జ్యూస్‌తో వేసవి ఎండలకు ఉపశమనం

బయట ఎండలు మండుతున్నాయి. ఎండవేడికి శరీరంలో నీరంత చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాంతో పాటు వడదెబ్బ, డయేరియా వంటి సమస్యలు వేధిస్తుంది. వీటి బారి నుంచి మన శరీరాన్ని రక్షించుకోవాలంటే వేసవిలో చల్లచల్లగా ఏదైనా కూల్‌డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకుంటుండాలి. వేసవిలో శరీరంలో నీటిని బ్యాలెన్స్ చేయడానికి టామోట్ జ్యూస్‌ని తీసుకుంటే మంచిది. అలాంటి జ్యూస్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!
 
కావలసిన పదార్థాలు:
టమోటో: 200 గ్రాములు
క్యారెట్ తురుము : అర కప్పు
పంచదార: 1 కప్పు
నిమ్మరసం: తగినంత
మిరియాల పొడి: చిటికెడు
నీళ్లు: కావాలసినంత
 
తయారు చేయు విధానము:
మిక్సీ జార్ తీసుకుని అందులో టొమోటో, క్యారెట్ తురుము, పంచదార, మిరియాల పొడి, నిమ్మరసం, తగినన్నినీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్నివడకట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ సమ్మర్ టొమోటో జ్యూస్ రెడీ. ఈ జ్యూస్‌ని గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాని తీర్చుతుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది.