శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2015 (19:13 IST)

చీమలకు కాఫీ వాసనంటే పడదు.. కాఫీ పౌడర్ చిలకరిస్తే..!

చీమలకు కాఫీ వాసనంటే పడదు. కాబట్టి మీరు ఉపయోగించిన కాఫీ గింజలను లేదా కాఫీ పౌడర్‌ను చిలకరించినా చాలు చీమలు రాకుండా నివారించుకోవచ్చు. చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. చీమలు ఉప్పును నాశనం చేయలేవు కానీ, సాల్ట్ వాటర్‌ను డియోడరెంట్ గా ఉపయోగించడం వల్ల ఇంట్లోకి రాకుండా చేయవచ్చు. ఇంకా చీమలు తిరిగే ప్రదేశంలో చల్లినా చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. 
 
అలాగే వెనిగర్‌ను కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసి చీమలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు రోజులు చేస్తే చీమలు తిరిగి చేరవు. చీమల బెడదను వదిలించుకోవాలంటే.. సోప్ వాటర్‌లో కొద్దిగా హాట్ వాటర్ మీక్స్ చేసి వాటి మీద స్ప్రే చేయాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చీమలను నివారించడానికి కొద్దిగా బేబీ పౌడర్‌ను చీమలున్న ప్రదేశంలో చిలకరించాలి. ఇలా చేయడం వల్ల ఇది చీమలు ఇంట్లోకు రాకుండా నివారిస్తుంది.