గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:40 IST)

ఐపీఎల్ 2018 : ఢిల్లీ డేర్‌ డెవిల్స్ బ్యాట్స్‌మెన్లపై మండిపడిన గంభీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీ లీగ్ పోటీల్లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ గౌత గంభీర్ మండిపడ్డారు. సోమవారం రాత్రి సొంత మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన స్వల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 టోర్నీ లీగ్ పోటీల్లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ గౌత గంభీర్ మండిపడ్డారు. సోమవారం రాత్రి సొంత మైదానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన స్వల్ప స్కోరును చేరుకోలేక చతికిలపడ్డారు. ఆ జట్టు కేవలం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక విఫలమైంది. దీనిపై జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
 
ఇదే అంశంపై గంభీర్ మాట్లాడుతూ, 144 పరుగుల లక్ష్యాన్ని కూడా తాము ఛేదించలేదని గుర్తు చేసిన ఆయన, ఇలాగైతే పాయింట్ల పట్టికలో ముందుకెళ్లడం కష్టమేనన్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడానికి కారణం త్వరగా వికెట్లు కోల్పోవడమేనని చెప్పారు. ఆట మధ్యలో పరుగులు చేసినా, క్రమంగా వికెట్లు పడిపోవడంతో గెలుపు అవకాశాలు దూరమయ్యాయని తెలిపారు. 
 
అయితే, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా బ్యాటింగ్‌లో రాణించడం భవిష్యత్తుకు శుభ పరిణామమని చెప్పాడు. కేవలం 10 బంతుల్లో 22 పరుగులు చేసిన పృథ్వీని అభినందించిన గంభీర్, ఇక తదుపరి మ్యాచ్‌లపై దృష్టిని పెట్టనున్నట్టు గంభీర్ చెప్పుకొచ్చారు.