శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (10:48 IST)

ఒక జట్టు కన్నీరెట్టిన వేళ.. మరొక జట్టు ఆనంద హేల.. విషాదంలో పుణె సూపర్ జెయింట్

విజయానికి చేరువైన జట్టులో అంతవరకు బాధ్యతాయుతమైన పాత్ర పోషించిన కెప్టెన్ ఒక్క రాంగ్ షాట్ కొట్టిన క్షణం ఐపీఎల్ 10 టైటిల్ పుణె సూపర్ జెయింట్‌కు దూరమైంది. అద్భుతం అనిపించేలా సాగిన పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆట ఒక్క తప్పుడు షాట్‌తో మొత్తం జ

విజయానికి చేరువైన జట్టులో అంతవరకు బాధ్యతాయుతమైన పాత్ర పోషించిన కెప్టెన్ ఒక్క రాంగ్ షాట్ కొట్టిన క్షణం ఐపీఎల్ 10 టైటిల్ పుణె సూపర్ జెయింట్‌కు దూరమైంది. అద్భుతం అనిపించేలా సాగిన పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆట ఒక్క తప్పుడు షాట్‌తో మొత్తం జట్టునే నివ్వెరపర్చింది. ఆ  తప్పు షాట్ విలువ ఆ జట్టుకు 15 కోట్ల రూపాయలను దూరం చేసింది. ఐపీఎల్ టోర్నీలో తొలిసారి టైటిల్ గెలిచే అరుదైన అవకాశానికి కూడా తలుపులు మూసేసింది. ఎందుకంటే పుణే సూపర్ జెయింట్ జట్టు వచ్చే ఐపీఎల్‌లో ఆడే చాన్స్ లేదు. చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై విధించిన రెండేళ్ల నిషేధం ఈ ఏడాదితో తొలగిపోనుంది కనుకు పుణె జట్టుకు గుజరాత్ జట్టుకు వచ్చే ఐపీఎల్ లో ఆడే అవకాశం దూరమైంది.
 
రవిశాస్త్రి ఆనందంతో కూడిన స్వరంతో రోహిత్ శర్మను విన్నర్స్ చెక్‌ను తీసుకోవాలని డయాస్ మీదికి ఆహ్వానిస్తున్న సమయంలో పుణె జట్టు కెప్టెన్ స్మిత్ తన ఒక్క పొరపాటు చర్య టీమ్‌ని టైటిల్ కే దూరం చేసిన వైనంపై విచారిస్తూ కనిపించాడు.  స్మిత్ చుట్టూ పుణె జట్టు సభ్యులు షాక్ లోంచి తేరుకోని స్థితిలోనే కనిపించారు. వారి ముఖాల్లో నెత్తురు చుక్క లేదు. జట్టుసభ్యులైన అశోక్ దిండా, బాబా అపరాజిత్ వంటివారైతే నిస్తేజమైన పిచ్చి చూపులతో కనిపించారు. జట్టులోని ఇతర సభ్యులైతే కన్నీళ్లు పెట్టుకున్నారు.  
 
పుణె సూపర్ జెయింట్ మానసికస్తితిని జట్టు కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ మాటలు సరిగ్గా ప్రతిఫలించాయి. ఒకే ఒక పరుగు తేడాతో ఆట చేజార్చుకోవడం తీవ్రమైన ఆశాభంగం కలిగిస్తుంది. ఐపీఎల్ అంటే అంగుళాలు, మీటర్ల తేడాతో తేలిపోయే గేమ్. చివరి ఓవర్ వరకూ స్టీవ్ స్మిత్ చివరి ఓవర్ లోనూ విజయాన్ని దగ్గరగా తీసుకొచ్చాడు. వికెట్ చాలా టఫ్‌గా ఉండటంతో స్కోర్ చేయడమే కష్టమైపోయింది. కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోయాం. గేమ్‌ను ఆ సమయంలో కోల్పోవాలని ఎవరూ అనుకోరు. కానీ బంతిబంతికీ ముంబై జట్టు బౌలర్లు మాపై ఒత్తిడి పెంచారు. తీవ్రమైన ఒత్తిడి, తప్పిదాలు, అయినప్పటికీ గొప్ప ప్రదర్శనలో భాగమయ్యామన్న తృప్తి మిగిలింది అని కోచ్ ఫ్లెమింగ్ సమర్థించుకున్నాడు.