శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (08:58 IST)

ఎయిర్‌టెల్ 4జీ ఫోన్‌లో ఫీచర్లివే...

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కల

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కలిగిన 4జీ స్మార్ట్ ఫీచర్‌ను దీపావళికి మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 
 
ఇప్పటికే హ్యాండ్‌సెట్ కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయని.. కస్టమర్లకు అందించటానికి సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించింది. ప్యాకేజీ కూడా అతి తక్కువగా ఉంటుందని.. జియోకి దగ్గరగానే ఉండే అవకాశం ఉందని చెబుతోంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌ ఫోన్‌లో కాల్స్ ఉచితం.. డేటాకి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని తెలిపింది. 
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, 1జీబీ ర్యామ్, 4 అంగుళాల టచ్ స్క్రీన్, వీఓఎల్టీఈ, ఆండ్రాయ్ ఓఎస్, డ్యుయెల్ కెమెరా, అత్యాధునికమైన బ్యాటరీని ఇందులో పొందుపరిచారు.