మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (10:59 IST)

చాలా పెద్ద తప్పు చేశా.. క్షమించండి : మార్క్ జుకర్ బర్గ్

తాము చాలా పెద్ద తప్పు చేశామని, అందువల్ల ఈ ఒక్కసారికి క్షమించి వదిలివేయాలని ఫేస్‌బుక్ చీప్ మార్క్ జుకర్ బర్గ్ మరోమారు విజ్ఞప్తిచేశారు. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌లో యూజర్లు దాచుకుంటున్న సమస్త సమా

తాము చాలా పెద్ద తప్పు చేశామని, అందువల్ల ఈ ఒక్కసారికి క్షమించి వదిలివేయాలని ఫేస్‌బుక్ చీప్ మార్క్ జుకర్ బర్గ్ మరోమారు విజ్ఞప్తిచేశారు. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌లో యూజర్లు దాచుకుంటున్న సమస్త సమాచారమూ పరుల పాలైంది. ఇది ఫేస్‌బుక్ పరువు తీసింది. దీంతో ఆ సంస్థ అధిపతిగా ఆయన నష్టనివారణ చర్యలు చేపట్టారు.
 
ఇందులోభాగంగా, ఆయన మరోమారు మీడియా ముందుకు వచ్చారు. తాను చాలా పెద్ద తప్పు చేశానని, మన్నించి, సంస్థను మరింత ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్లేందుకు ఇంకొక్క అవకాశాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. థర్డ్ పార్టీకి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో నియమ నిబంధనల లోపాల కారణంగానే ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. 
 
కేంబ్రిడ్జి ఎనలిటికాలో జరిగిన కుంభకోణం తర్వాత ఫేస్ బుక్ డేటా చౌర్యం సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌లో ఖాతాలున్న 8.7 కోట్ల మంది వివరాల చోరీ జరుగగా, ఇందులో అత్యధిక ఖాతాలు అమెరికన్లవే. 2004లో ఫేస్‌బుక్‌ను స్థాపించిన జుకర్ బర్గ్, కొన్ని తప్పులు జరిగినందువల్లే డేటా చౌర్యానికి అవకాశం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.