మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (18:38 IST)

శివరాత్రి రోజున పూజ ఎలా చేయాలి? కైలాస వాసం ప్రాప్తించాలంటే..?

మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే "మహాశివరాత్రి" పర్వదినం చాలా విశిష్టమైనది. సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున "శివరాత్రి" వస్తూనే ఉంటుంది. దీనిని "మాసశివరాత్రి" అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశే

మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే "మహాశివరాత్రి" పర్వదినం చాలా విశిష్టమైనది. సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున "శివరాత్రి" వస్తూనే ఉంటుంది. దీనిని "మాసశివరాత్రి" అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. కానీ మహాశివరాత్రికి మహాత్మ్యం ఎక్కువ.

అందుచేత "మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. 
 
మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. 
 
అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి, మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.