శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (17:04 IST)

జయలలిత మృతి : కారు డ్రైవర్ ఎమని జవాబు చెప్పారు?

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె వ్యక్తిగత కారు డ్రైవర్ ఆర్ముగస్వామి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ ఎదుట శనివారం హాజరయ్యారు.

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె వ్యక్తిగత కారు డ్రైవర్ ఆర్ముగస్వామి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ ఎదుట శనివారం హాజరయ్యారు. 2016 సెప్టెంబర్‌ 22 రాత్రి జయలలిత అస్వస్థతకు గురైన విషయం తెలుసునా? ఆ సమయంలో పోయెస్‌ గార్డెన్‌లో ఉన్నారా? లేక ఇంట్లో ఉన్నారా? అని ఆర్ముగస్వామి అయ్యప్పన్‌ను ప్రశ్నించారు. 
 
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను చూశారా? ఆమె మృతిపై మీకేవైనా సందేహలు ఉన్నా యా? అంటూ ఆయన అడిగారు. అన్ని ప్రశ్నలకు అయ్యప్పన్‌ ఓపికగా సమాధానాలిచ్చినట్టు తెలుస్తోంది. అదేసమయంలో జయలలిత తనను కారు డ్రైవర్‌గా కాకుండా కన్నబిడ్డలా చూసుకునే వారని, ఆమె మృతి తనను తీవ్రంగా బాధించిందని అయ్యప్పన్‌ తెలిపారు. 
 
ఆమె వద్ద గత 12 ఏళ్లుగా కారు డ్రైవర్‌గా పని చేసిన అయ్యప్పన్‌ జయ అనారోగ్య పరిస్థితులు గురించి సమగ్రంగా వివరించినట్లు తెలిసింది. అయ్యప్పన్‌ ఇచ్చిన సాక్ష్యాన్ని విచారణ సంఘం అధికారులు వీడియో ద్వారా చిత్రీకరించారు. కొన్ని ప్రశ్నలకు రాతపూర్వక సమాధా నాలు కూడా సేకరించారు. ఇక జయలలిత మరో కారు డ్రైవర్‌ కన్నన్‌ వద్ద కూడా ఈ కమిటి విచారణ జరుపనుంది.