గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (09:43 IST)

భారత జాలర్ల చెప్పులంటే లంక నేవీ అధికారులకు ఎంత ప్రేమో.. ఎందుకంటే!

సాధారణంగా ఒకరు వేసుకునే చెప్పులను మరొకరు వేసుకోరు. అలాంటిది భారత జాలర్ల చెప్పులంటే శ్రీలంక నేవీ అధికారులకు మహా ఇష్టం. అందుకే తమ చెరలో ఉన్న జాలర్లను వదిలిపెట్టేందుకు వారి పాదరక్షకులను లంచంగా తీసుకున్నా

సాధారణంగా ఒకరు వేసుకునే చెప్పులను మరొకరు వేసుకోరు. అలాంటిది భారత జాలర్ల చెప్పులంటే శ్రీలంక నేవీ అధికారులకు మహా ఇష్టం. అందుకే తమ చెరలో ఉన్న జాలర్లను వదిలిపెట్టేందుకు వారి పాదరక్షకులను లంచంగా తీసుకున్నారు. ఈ విషయం భారత్‌కు చేరుకున్న జాలర్లు ఈ విషయాన్ని వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఇటీవల రామనాథపురం జిల్లా రామేశ్వరంకు చెందిన జాలర్లు 400 పడవల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వీరు భారత్ - శ్రీలంక సరిహద్దుల్లో చేపల వేటాడుతుండగా, గస్తీ తిరుగుతున్న శ్రీలంక నావికాదళ సిబ్బంది తమిళ జాలర్లను అక్కడ నుంచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. తొలుత ఇందుకు నిరాకరించిన జాలర్లపై దాడులకు తెగబడ్డారు. శేషు అనే జాలరి పడవను శ్రీలంక నావికాదళ సిబ్బంది స్వాధీనం చేసుకొని అందులో ఉన్న వలలు, చేపలు, రొయ్యలు, జీపీఎస్‌ పరికరాలను కూడా తీసుకున్నారు. 
 
అయితే, ఈ పడవలో ఉన్న ఐదుగురు జాలర్లు లంక నేవి అధికారుల కాళ్ళావేళ్లాపడి ప్రాధేయపడటంతో వారు వేసుకున్న పాదరక్షలను తీసుకొని పడవతోపాటు... వారు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తిరిగి అప్పగించేశారు. ఈ విషయాన్ని రామేశ్వరం తీరానికి తిరిగొచ్చిన జాలర్లు వెల్లడించారు. దీనిపై భారత జాలర్లు మాట్లాడుతూ... శ్రీలంకలో ఒక జత పాదరక్షలు రూ.400 నుంచి రూ.800 వరకు ధర పలుకుతుండటంతో తమ చెప్పులను లంక నేవీ అధికారులు తీసుకునివుంటారని చెప్పారు.