శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (13:14 IST)

హోసురు ఎమ్మెల్యే ఇంటికెళ్లి వచ్చిన శశికళ... ఎలా? (Video)

కర్ణాటక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) డి.రూపా మరో బాంబు పేల్చారు. బెంగ‌ళూరు ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో శ‌శిక‌ళ‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు అందిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు చేసిన ఈమె.. మొన్నటికిమొన్న శశికళ జ

కర్ణాటక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) డి.రూపా మరో బాంబు పేల్చారు. బెంగ‌ళూరు ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో శ‌శిక‌ళ‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు అందిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు చేసిన ఈమె.. మొన్నటికిమొన్న శశికళ జైలు నుంచి బయటకు వెళ్లివచ్చినట్టు ప్రకటించడమే కాకుండా, దీనికి సంబంధించిన వీడియోను కూడా కర్ణాటక ఏసీబీకి అందజేశారు. 
 
తాజాగా ఏసీబీకి ఇచ్చిన నివేదిక‌లో శ‌శిక‌ళ ఎక్క‌డికి వెళ్లాచ్చారో కూడా రూపా వెల్ల‌డించింది. సెంట్ర‌ల్ జైల్‌కు ద‌గ్గ‌ర‌ల్లో ఉన్న హోసూర్ ఎమ్మెల్యే ఇంటికి శ‌శిక‌ళ వెళ్లొచ్చేవార‌ని అన్నాడీఎంకేకు చెందిన విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింద‌ని రూపా ఆ నివేదిక‌లో స్ప‌ష్టంచేసింది. సెంట్ర‌ల్ జైల్ ఎంట్ర‌న్స్ ద‌గ్గ‌ర‌, గేట్ 1, గేట్ 2 ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యిన వీడియోలే దీనికి సాక్ష్యమ‌ని ఆమె పేర్కొన్నారు. 

 
 
అదేసమయంలో శ‌శిక‌ళ‌కు ఎలాంటి ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించ‌డం లేద‌ని చెప్పిన హోంమంత్రి, హోంశాఖ కార్య‌ద‌ర్శిని జైలు అధికారులు త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని కూడా ఈ రిపోర్ట్‌లో రూపా ఆరోపించింది. కాగా, హోసూరు ఎమ్మెల్యేగా తెలుగు నేతల పి.బాలకృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. పైగా ఈయన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో ఈ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది.