గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (14:42 IST)

వేదనిలయంలోని సీక్రెట్ రూమ్.. జయలలిత కాలివేలిముద్రే బయోమెట్రిక్ కీ... నిజమా?

చెన్నై నగరంలోని కోటీశ్వరులు నివసించే ఏరియాల్లో పోయెస్ గార్డెన్ ఒకటి. ఇక్కడ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి ఎంతో మంది వీవీఐపీలు నివసిస్తుంటారు. అయితే, ఈ ఏరియాలో ఉండే ఇతర

చెన్నై నగరంలోని కోటీశ్వరులు నివసించే ఏరియాల్లో పోయెస్ గార్డెన్ ఒకటి. ఇక్కడ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి ఎంతో మంది వీవీఐపీలు నివసిస్తుంటారు. అయితే, ఈ ఏరియాలో ఉండే ఇతరుల నివాసాల కంటే జయలలిత నివసించిన వేదనిలయంకు ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు ఉంది. జయలలిత మరణానంతరం ఇక్కడ ఆమె ప్రియనెచ్చెలి శశికళ ఉన్నారు. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకెళ్లడంతో జయలలిత అన్న కుమారుడు దీపక్ జయకుమార్ ఉంటూ వచ్చారు. 
 
ఈ ఇంటికోసం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నివాసాన్ని జయలలిత స్మారక మందిరంగా మార్చుతున్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి ఈ నివాసం మరింత హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, ఈ ఇంటిలో ఏముందనే విషయం జయలలిత, శశికళ, ఇంట్లో పని చేసే పనివారికి మినహా ఇతరులెవ్వరికీ తెలియదు. కానీ, వేద నిలయంపై ఆసక్తికర వార్త ఒకటి తమిళనాట చక్కర్లు కొడుతోంది. 
 
జయలలిత తన జీవితకాలంలో సంపాదించిన సొత్తు మొత్తాన్ని ఈ ఇంటిలోని ఒక రహస్య గదిలో దాచి ఉంచారన్నది ఆ వార్త సారాంశం. అయితే, ఇపుడు ఆ గదిని తెరవడం అంత సులభం కాదట. ఆ గదికి సంబంధించిన బయోమెట్రిక్ కీ జయలలిత దగ్గరే ఉందట. ఇంతకీ ఆ బయోమెట్రిక్ కీ ఏంటో తెలుసా.. జయలలిత కాలివేలిముద్రట. ఈ బయోమెట్రిక్ యంత్రంలో జయలలిత కాలి వేలిని పెడితేనే ఆ సీక్రెట్ రూమ్ డోర్‌ను తెరుచుకుంటుందట. 
 
అదేసమయంలో జైలు శిక్ష విధించిన రోజు శశికళ వేదనిలయంలో రాత్రి బస చేశారు. ఇది కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా, సీక్రెట్ గదిలో సొత్తు ఉందా? లేక తరలించేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలింతకీ ఈ సీక్రెట్ గది నిజమా? కల్పనా? అన్నదానిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంమీద జయలలిత నివాసం వేద నిలయం మరోమారు చర్చల్లో నిలిచింది.