గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:19 IST)

కమలం పార్టీకి షాక్ : సీనియర్ నేత యశ్వంత్ సిన్హా గుడ్‌బై

భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టంచేశారు.

భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టంచేశారు.
 
వాస్తవానికి ఆయన గత కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ, 'బీజేపీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఇదే వేదికగా ప్రకటిస్తున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు.
 
ముఖ్యంగా, బడ్జెట్ మలివిడత సమావేశాల్లో భాగంగా, పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కేంద్రం వైఖరే కారణం. ప్రధాని మోడీ కనీసం ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి ఎందుకు చర్చించలేకపోయారంటూ ఆయన నిలదీశారు. 
 
కాగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలతో తాను సమావేశం నిర్వహించనున్నాననీ... ప్రత్యమ్నాయ రాజకీయ వేదిక కోసం చర్చిస్తానని ఆయన గురువారమే ప్రకటించారు. మరో బీజేపీ అసమ్మతి నేత శతృఘ్ను సిన్హాతో కలిసి 'రాష్ట్ర మంచ్' పేరుతో ఈ సమావేశం జరుగుతోంది.