శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 జులై 2016 (13:43 IST)

హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టే చేపలతో బిర్యానీ చేయడం ఎలా?

వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో సీ ఫుడ్ కూడా ఒకటి. హై ప్రోటీన్లు, ఐయోడిన్, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫాట్ లెస్ చేపలను వర్షాకాలంలో తీసుకుంటే విటమిన్ డితో పాటు ఒమెగా - 3 యాసి

వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో సీ ఫుడ్ కూడా ఒకటి. హై ప్రోటీన్లు, ఐయోడిన్, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫాట్ లెస్ చేపలను వర్షాకాలంలో తీసుకుంటే విటమిన్ డితో పాటు ఒమెగా - 3 యాసిడ్స్‌ను ఆరోగ్యానికి అందించినట్లవుతుంది. తద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. గుండెను పదిలం చేసుకోవచ్చు. వారానికి రెండు సార్లు లేదా ఒక్కసారైనా చేపల్ని డైట్‌లో చేర్చుకునే వారిలో హృద్రోగ సమస్యలుండవని ఇప్పటికే అనేక పరిశోధనలు తేల్చాయి. అలాంటి చేపలతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
ముల్లులేని చేప ముక్కలు : కిలో 
బాస్మతి రైస్ : కిలో 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : పావు కప్పు 
జాజికాయ : రెండు
కొత్తిమీర, పుదీనా : ఒక కప్పు 
కుంకుమ పువ్వు: చిటికెడు
పెరుగు : అర కప్పు 
గుడ్డు: ఒకటి
ఉల్లి తరుగు : అర కప్పు 
కారం :  టేబుల్ స్పూన్
పసుపు :  అర టీ స్పూన్
లవంగాలు: పది
యాలకులు: టీస్పూను, 
దాల్చినచెక్క: రెండు 
నిమ్మకాయలు: నాలుగు, 
నూనె, ఉప్పు : తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కల్ని ఉడికించి.. ముల్లు తీసి పక్కనబెట్టుకోవాలి. వీటికి పసుకు, గుడ్డుసొన, ఉప్పు, పసుపు పట్టించి ఓ గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి చేపముక్కల్ని బ్రౌనిష్‌గా వేపుకుని ప్లేటులోకి తీసుకోవాలి. మరోవైపు బాస్మతి రైస్‌‍ను శుభ్రం చేసి కడిగి నానబెట్టుకోవాలి. 
 
ఓ గిన్నెలో అల్లంవెల్లుల్లి, గరంమసాలా, కారం, పసుపు, కొత్తిమీర తురుము, పుదీనా తురుము వేసి కలిపి ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ లేదా పాన్‌లో కొద్దిగా నూనె వేసి గిలకొట్టిన పెరుగు, మసాలా మిశ్రమం వేసి ఆ నూనె తేలేవరకూ వేయించాలి. మందపాటి గిన్నెలో మూడు లీటర్ల నీళ్లు పోసి కడిగిన బియ్యం, ఉప్పు, నూనె వేసి ముప్పావు భాగం ఉడికించేయాలి. నీళ్లెక్కువైతే వంపేయాలి. 
 
తర్వాత మరో మందపాటి గిన్నెలో అడుగున అన్నం.. ఆపై చేపముక్కలు.. వాటిపై పెరుగు మసాలా మిశ్రమం కలిపి వాటిపైన వేయించుకున్న ఉల్లి ముక్కలు.. నిమ్మరసం, కుంకుమపువ్వు చల్లి.. మూతపెట్టి పది నిమిషాల పాటు దమ్ చేయాలి. అంతే టేస్టీ ఫిష్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీకి చికెన్ 65, ఉల్లి రైతా, ఉడికించిన ఎగ్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.